హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి తమ కొత్త సినిమా కోసం రంగంలోకి దిగారు. ఇటీవల గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి ప్రారంభించారు. ఈ సినిమాను కంటిన్యూ షెడ్యూల్స్ లో ఫినిష్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి వెంకీ అనిల్ కాంబో మూవీని రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాను శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి వెంకటేష్ కలిసి ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత చేస్తున్న మూడో చిత్రమిది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఒక మాజీ పోలీస్ అధికారి, అతని మాజీ ప్రేయసి, మాజీ భార్య మధ్య సాగే ఎంటర్ టైనర్ ఇది.