వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకీ ఉత్సాహంగా మాట్లాడారు. చిరంజీవితో కలిసి సినిమా చేయడం, మహేశ్, తన సినిమాలు ఒక రోజు తేడాతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం, త్రివిక్రమ్ తో సినిమా వంటి అంశాలపై వెంకటేష్ ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చారు. మహేశ్ నటించిన గుంటూరు కారం, తన సైంధవ్ సినిమాలు రెండూ ప్రేక్షకులు చూస్తారని, రెండు సినిమాల మీద ఆసక్తిగా ఉన్నారని వెంకటేష్ అన్నాడు.
అలాగే మంచి కథ దొరికితే చిరంజీవితో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పాడు. త్రివిక్రమ్ కాంబోలో మూవీ గురించి అడిగితే…ఇక్కడున్న ఎవరైనా ఆయనకు ఫోన్ చేసి ఈ విషయం అడగండి అంటూ జోక్ వేశారు. ఇక సైంధవ్ గురించి చెబుతూ తన కెరీర్ లో ఎప్పటినుంచే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయాలని అనుకుంటున్నానని, అది ఈ సినిమాతో తీరిందని వెంకటేష్ అన్నాడు. తన కెరీర్ లో సైంధవ్ బెస్ట్ ఫిలిం అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఈ నెల 13న సైంధవ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.