వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమా ఓటీటీ డేట్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో దర్శకుడు శైలేష్ కొలను రూపొందించారు. ఇది వెంకటేష్ కు 75వ మూవీ కావడంతో బాగా అంచనాలు ఏర్పడ్డాయి.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సైంధవ్ థియేటర్స్ లో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. కథలోని ఎమోషన్ ప్రేక్షకులకు రీచ్ కాలేదు. సైంధవ్ థియేటర్స్ రిజల్ట్ ను మర్చిపోయే మంచి రెస్పాన్స్ ఓటీటీలో వస్తుందంటూ ఆశిస్తున్నారు మేకర్స్. అమోజాన్ ప్రైమ్ వీడియోలో సైంధవ్ మూవీ ప్రీమియర్ కు రాబోతోంది. ఈ సినిమా వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ విషయంపై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వాల్సిఉంది.