గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవర. కొరటాల శివ తెరకెక్కించిన దేవర రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. సోమవారం టెస్ట్ కూడా పాస్ అయ్యింది. ఈ మూవీకి మిశ్ర స్పందన వచ్చినప్పటికీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తుండడం విశేషం. అయితే.. ఈ మూవీని బాలీవుడ్, కోలీవుడ్ లో ప్రమోట్ చేశారు కానీ.. ఇక్కడ మాత్రం అంతగా ప్రమోట్ చేయలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే.. క్యాన్సిల్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు భారీ సక్సెస్ మీట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. ఎప్పుడు..? ఎక్కడ..? అనేది మాత్రం క్లారిటీ లేదు.
చదవండి: ఒకే నెలలో ప్రభాస్ నాలుగు సినిమాలు
విషయం ఏంటంటే.. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది కాబట్టి హైదరాబాద్లోనే భారీగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. మరో వైపు గుంటూరు లేదా విజయవాడలో దేవర సక్సెస్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దసరా సెలబ్రేషన్స్ ఉన్న కారణంగా విజయవాడలో పోలీసులు దేవర ఈవెంట్ కు అనుమతి నిరాకరించారు. దీంతో ఎక్కడ విజయోత్సవం జరుపుతారనేది క్లారిటీ లేదు.
ఈరోజు గాంధీ జయంతి. ఆతర్వాత నుంచి దసరా హాలీడేస్ కావడంతో కలెక్షన్స్ మరింతగా పెరుగుతాయి. ఇలాంటి టైమ్ లో భారీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తే మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. అందుకనే మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ గా గట్టిగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దేవర విజయోత్సవ వేడుక ఎక్కడ అనేది ప్రకటించనున్నారని సమాచారం.