హీరో విజయ్ ఆంటోనీ నటించిన “తుఫాన్” మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే తమిళంలో రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఆ పాజిటివ్ టాక్ ఇచ్చిన ఉత్సాహంతో తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ కు వస్తోంది. తమిళంతో పాటు తెలుగులోనూ గత శుక్రవారం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొద్ది ఆలస్యంగా టాలీవుడ్ లోకి వస్తోంది.
“తుఫాన్” సినిమా శ్రీ సిరి సాయి సినిమాస్ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. “తుఫాన్” సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో “తుఫాన్” సినిమాను రూపొందించారు దర్శకుడు విజయ్ మిల్టన్.