ఈరోజు ఆగస్టు 2న సినిమాలన్నీ రిలీజ్ కు క్యూ కట్టాయి. వాటిలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన హీరో విజయ్ ఆంటోనీ “తుఫాన్” పోస్ట్ పోన్ అయ్యింది. వారం రోజులు ఆలస్యంగా ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు.
చదవండి: ‘నువ్వంటే ఇష్టం లేదని చెప్పేయ్…’నభా “డార్లింగ్” డైలాగ్ వైరల్
పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో “తుఫాన్” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. “తుఫాన్” సినిమా శ్రీ సిరి సాయి సినిమాస్ ద్వారా ఆగస్టు 9న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన స్నీక్ పీక్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ కు కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇవ్వబోతోంది “తుఫాన్” మూవీ.