స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. తల్లిదండ్రులు గోవర్ధన్, మాధవిలతో కలిసి హైదరాబాద్ లోని తమ ఇంటిలో విజయ్, ఆనంద్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
విజయ్ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, వారి కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం పూజా కార్యక్రమాలు జరిపారు. ఆ తర్వాత విజయ్ ఆనంద్ వారి పేరెంట్స్ తో కలిసి ఫొటోస్ తీసుకున్నారు. విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు, ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.