హీరోయిన్ రశ్మికతో విజయ్ దేవరకొండ వివాహం జరగనుందనే వార్తలు ఇటీవల బాగా వస్తున్నాయి. నెక్ట్ ఇయర్ వీరు పెళ్లి చేసుకుంటారని టాక్ స్ప్రెడ్ అవుతోంది. దీనిపై రీసెంట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. రశ్మిక తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని, తాము పెళ్లి చేసుకోవడం అనే వార్తలు అబద్ధమని ఆయన చెప్పారు. తాను పెళ్లి చేసుకోవాలని కొన్ని మీడియా సంస్థలు బాగా కోరుకుంటున్నాయని విజయ్ అన్నారు. నాతో ఏదో ఒకటి చెప్పించాలని వారు ప్రయత్నిస్తున్నారు. కానీ రశ్మిక నేను ఫ్రెండ్స్ గానే ఉంటాం. మా పెళ్లి మాట అవాస్తవం అని విజయ్ చెప్పారు.
గీత గోవిందం సినిమాతో ఫస్ట్ టైమ్ కలిసి నటించారు విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న. ఆ సినిమా సక్సెస్ తో వీరికి హిట్ పెయిర్ గా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీలో జంటగా నటించారు. ఈ సినిమా కూడా విజయ్, రశ్మికకు మంచి పేరు తెచ్చింది. దీంతో వీరిపై అందరి దృష్టి ఉంటోంది. ప్రస్తుతం రశ్మిక, విజయ్ ఎవరి కెరీర్ లో వారు ఎదగాలని ప్రయత్నిస్తూ క్రేజీ మూవీస్ చేస్తున్నారు.