కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా హాలీవుడ్ ఫ్రీమేక్ అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ సినిమాను ఏజెస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తుండగా..వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ హీరోగా నటిస్తున్న 68వ చిత్రమిది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోందీ సినిమా.
ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అది హాలీవుడ్ మూవీ జెమినీ మ్యాన్ ను పోలి ఉందంటూ ట్రోల్స్ వస్తున్నాయి. విల్ స్మిత్ డ్యూయల్ రోల్ చేసిన సినిమా అది. విజయ్ కు లాస్ట్ ఇయర్ బిగ్ హిట్స్ లేవు. అందుకే ఈసారి బ్లాక్ బస్టర్ ఇవ్వాలంటూ దర్శకుడిని ట్యాగ్ చేస్తున్నారు నెటిజన్స్.