కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మూవీ టైటిల్ ను న్యూ ఇయర్ సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఏజెస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే టైటిల్ ను ప్రకటించారు. సోషల్ మీడియాలో గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే ట్యాగ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి.
టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఇద్దరు విజయ్ లు కనిపిస్తున్నారు. ఈ కథ డ్యూయెల్ రోల్ తో ఉంటుందని పోస్టర్ తో తెలుస్తోంది. ఈ సినిమాలో జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ రంగంలోనైనా బాగా సక్సెస్ సాధించిన వారిని ది గోట్ అనే ట్యాగ్ తో పిలుస్తుంటారు. విజయ్ సినిమాకు ఈ క్యాచీ టైటిల్ ను పెట్టుకోవడం పాజిటివ్ గా ఉంది.