కంటెంట్ బాగున్న సినిమాలు ఏ భాషవైనా తెలుగులో ఆదరణ పొందుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రీసెంట్ గా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన మహారాజ సినిమానే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రం గత నెల 14న తెలుగులో రిలీజైంది. ఇక్కడ మంచి సూపర్ హిట్ టాక్ తో మంచి వసూళ్లు దక్కించుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన ఎన్వీప్రసాద్ కు కనీసం 10 కోట్ల రూపాయల లాభాలను తీసుకొచ్చింది.
ఇప్పుడీ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. జూలై 19 నుంచి నెట్ ఫ్లిక్స్ లో మహారాజ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు స్వామినాథన్ దర్శకత్వం వహించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ మరియు థింక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, అభిరామి, భారతీరాజా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.