విజయ్ సేతుపతి నటించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా “మహారాజ” సినిమా స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. నెట్ ఫ్లిక్స్ తాజాగా ఈ అనౌన్స్ మెంట్ చేసింది. ఈ చిత్రం గత నెల 14న తెలుగులో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ఘన విజయాన్ని సాధించింది.
థియేటర్స్ లో దక్కిన బ్లాక్ బస్టర్ సక్సెస్ తో “మహారాజ” ఓటీటీ రిలీజ్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు స్వామినాథన్ దర్శకత్వం వహించారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ మరియు థింక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, అభిరామి, భారతీరాజా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.