హీరో కల్యాణ్ రామ్ ప్రస్తుతం తన 21వ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను అశోక క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడు గతంలో నారా రోహిత్ హీరోగా రాజా చెయ్యి వేస్తే అనే సినిమాను రూపొందించారు. ఎన్ కేఆర్ 21 వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.
ఈ చిత్రంలో విజయశాంతి వైజయంతీ ఐపీఎస్ అనే కీ రోల్ చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత విజయశాంతి చేస్తున్న చిత్రమిది. ఈ రోజు విజయశాంతి బర్త్ డే సందర్భంగా ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేశారు. విజయశాంతి బర్త్ డే గ్లింప్స్ లో ఆమెను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించారు. వైజయంతీ యుద్ధం అయితే ఆమెకు తోడుగా ఉండే సైన్యంలా హీరో కల్యాణ్ రామ్ క్యారెక్టర్ ఉండనుంది.