పదేళ్లు ప్రజా జీవితంలో ఉండి డిఫ్యూటీ సీఎం అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు స్ఫూర్తినిచ్చారని అన్నారు హీరో చియాన్ విక్రమ్. ఈ రోజు తంగలాన్ ప్రెస్ మీట్ లో విక్రమ్ మాట్లాడుతూ పవన్ సాధించిన విజయం సాధారమైంది కాదన్నారు. పవన్ సినిమాలను ఇష్టపడతానని, ఆయన రాజకీయంగా తనకు స్ఫూర్తినిచ్చారని చెప్పారు.
చదవండి: ప్రభాస్ ఫుడ్ అమ్మను గుర్తు చేసింది – మాళవిక మోహనన్
చియాన్ విక్రమ్ మాట్లాడుతూ – పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వర్క్ అంటే నాకు ఇష్టం. ఆయన పదేళ్లు రాజకీయాల్లో కష్టపడి ఇప్పుడు డిఫ్యూటీ సీఎం అయ్యారు. అది సాధారణ అఛీవ్ మెంట్ కాదు. మాలాంటి వాళ్లకు పాలిటిక్స్ లోకి రావాలనుకుంటే ఆయన ఒక హోప్ ఇచ్చినట్లు అయ్యింది. అన్నారు.