చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
చదవండి: వయనాడ్ కు రూ.కోటి విరాళం ఇచ్చిన మెగాస్టార్
హీరో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ – తంగలాన్ వందేళ్ల క్రితం జరిగిన కథ. ఇదొక బ్యూటిఫుల్ అడ్వెంచరస్ మూవీ. డైరెక్టర్ రంజిత్ తన ఆర్ట్ ఫామ్ లో అందంగా రూపొందించాడు. తంగలాన్ ఒక మంచి సినిమా. మీరంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తారా అని వెయిట్ చేస్తున్నాను. మీకు సర్ ప్రైజ్ గా ఉండాలని తంగలాన్ సినిమా గురించి ఏమీ రివీల్ చేయడం లేదు. ఈ సినిమాలో అడ్వెంచర్, మెసేజ్, మ్యాజిక్, ఎమోషన్స్ ఉన్నాయి. ఇది నాకు దొరికిన ది బెస్ట్ రోల్ అని అనుకుంటున్నా.ఈ నెల 15న థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.