విక్రమ్ కెరీర్ లో రిలీజ్ కాకుండా ఆలస్యమవుతూ వచ్చిన చిత్రాలెన్నో ఉన్నాయి. మరే హీరోకు లేనంతగా ఈ క్రెడిట్ విక్రమ్ కే ఉంది. ఆయన ధృవనక్షత్రం సినిమా అలాగే జరుగుతోంది. ఇప్పుడు తంగలాన్ సినిమా కూడా విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. పా రంజిత్ దర్శకత్వం వహించిన తంగలాన్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ అప్డేట్ సర్క్యులేట్ అవుతోంది. ఆగస్టు 15న తంగలాన్ రిలీజ్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈ డేట్ కు రావాల్సిన పుష్ప2 పోస్ట్ పోన్ అయ్యింది. దాంతో ఆ స్లాట్ కోసం స్ట్రైట్ సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలూ కన్నేస్తున్నాయి. ఈ చిత్రంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో ఓ తెగకు చెందిన వారి జీవన పోరాటాన్ని చూపించబోతున్నారు దర్శకుడు పా రంజిత్. కొన్ని చారిత్రక యదార్థ ఘటనలు ఈ సినిమాకు నేపథ్యంగా ఎంచుకున్నారు. తంగలాన్ లో విక్రమ్ గెటప్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది.