వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘మట్కా’ సినిమా ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. 35 రోజుల ఈ భారీ షెడ్యూల్ కే దాదాపు 15 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఒకప్పటి వైజాగ్ లోకేషన్స్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో రిక్రియేట్ చేశారు. ఈ సెట్ లో మట్కా కొత్త షెడ్యూల్ షూటింగ్ జరగనుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న మట్కాకు వైజాగ్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.
1960 నుంచి 90 వరకు అనేక రకాల జూదాలు నిర్వహిస్తూ మట్కా కింగ్ గా పేరుతెచ్చుకున్న రతన్ ఖత్రీ జీవితంలోని పలు ఘటనల ఆధారంగా మట్కా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు కరుణకుమార్. మట్కా కింగ్ క్యారెక్టర్ ను వరుణ్ తేజ్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది.