మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. మరింత మంది ప్రేక్షకులను ఆకర్షించేందుకు అందుబాటు టికెట్ రేట్లతో “విరాజి” థియేటర్స్ లో ప్రదర్శితం కానుంది. సింగిల్ స్క్రీన్ లో 99 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 125 గా టికెట్ రేట్లు పెడుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ – ఆగస్టు 2న రిలీజ్ అవుతున్న “విరాజి” సినిమాకు మీ సపోర్ట్ ఇవ్వండి. మా సినిమా కోసం టికెట్ రేట్లు తగ్గిస్తున్నాం. ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో సింగిల్ స్క్రీన్ కి 99 రూపాయలు, మల్టీప్లెక్సులకు 125 రూపాయలుగా టికెట్ రేట్లు ఉంటాయి. మా మూవీ కి వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకుల్ని రప్పించేందుకు టికెట్ రేట్లు తగ్గించాం. మీరు సపోర్ట్ చేస్తే నాకు మరో నాలుగు మూవీస్ చేసే శక్తి వస్తుంది. పదిమందికి ఉపాధి దొరుకుతుంది. “విరాజి” మూవీని థియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
చదవండి: ‘మిస్టర్ బచ్చన్’లో తన క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పిన భాగ్యశ్రీ బోర్సే
దర్శకుడు ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ – “విరాజి” సినిమాకు మెయిన్ ఫిల్లర్ గా ఉన్నది మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ గారు. ఆయన ఒక టెక్నీషియన్ లా ఈ సినిమాకు పనిచేశారు. మరో ఫిల్లర్ వరుణ్ సందేశ్ గారు. ఆయన ఈ సినిమా కోసం చూపించిన డెడికేషన్ కు హ్యాట్సాఫ్. “విరాజి”తో సోషల్ ఎలిమెంట్, ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ఒక మంచి మూవీ చేశాం. అన్నారు.
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – నా కెరీర్ లో చెందూ, బాలు లాంటి క్యారెక్టర్స్ గుర్తుండిపోయాయి. అలాగే “విరాజి”లో ఆండీ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. “విరాజి”తో మీరంతా మరో అవకాశం ఇస్తారనే నమ్మకంతో ప్రమోషన్ చేస్తున్నాను. నేనెందుకు ఇంత ఎగ్జైటింగ్ గా ఉన్నాను అనేది ఆగస్టు 2న థియేటర్స్ లో మూవీ చూసినప్పుడు అర్థం చేసుకుంటారు. అన్నారు.