మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈరోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల.
చదవండి: పేరు మార్చుకున్న ఆకాష్ పూరి
నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ – సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచి విరాజికి మంచి రెస్పాన్స్ వస్తోంది. వరుణ్ సందేశ్ లుక్ తో పాటు ట్రైలర్ కు ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. మన సొసైటీలో ఉన్న ఒక అంశాన్ని తీసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్ తో విరాజి సినిమాను నిర్మించాం. ఇందులో రఘు కారుమంచి, ప్రమోదినీ వంటి ఇతర ఆర్టిస్టులు ఉన్నారు. అయితే హీరో మెయిన్ క్రౌడ్ పుల్లర్ కాబట్టి అతని ఫొటోతోనే ప్రమోషన్స్ చేస్తున్నాం. వరుణ్ గెటప్ కూడా కొత్తగా ఉంటుంది. అలా ఎందుకు ఉంది అనేది థియేటర్ లో చూడాలి. విరాజిలో మంచి కంటెంట్ ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుంటుందని అంటారనే నమ్మకం ఉంది. మా సంస్థలో ప్రస్తుతం బిగ్ బాస్ అమర్ దీప్, నటి సురేఖవాణి కూతురు సుప్రిత జంటగా ఓ మంచి లవ్, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నాం. అది 50 పర్సెంట్ షూట్ కంప్లీట్ అయ్యింది. ఏడాది చివరలో రిలీజ్ అనుకుంటున్నాం. అన్నారు.