రాను రానంటూనే వచ్చేసింది..?
కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ 8వ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. హౌస్‌లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారనేదానిపై ఫస్ట్ ప్రోగ్రాం సెప్టెంబర్ 1న టెలికాస్ట్ కాగా, అందులో ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్ సడన్ ఎంట్రీ ఇవ్వడంతో చూసినోళ్లంతా అవాక్కయ్యారు. ఇందులో ప్రముఖంగా వినిపించిన పేరు యాంకర్ విష్ణుప్రియ. బిగ్‌బాస్‌పై మీ అభిప్రాయం ఏంటి, అవకాశం వస్తే వెళ్తారా అని ఒకప్పుడు మీడియా అడిగిన ప్రశ్నకు….నాకు ఆ కాన్సెప్టే నచ్చదని, ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్లేదిలేదని ఖరాకండీగా చెప్పేసింది ఈ అమ్మడు.
చదవండి: “గదాధారి హనుమాన్” విరాబ్ స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ 1
బిగ్‌బాస్‌లోకి విష్ణుప్రియ ఎంట్రీతో అంతా అవాక్కు..!
అంతేనా, షోలో జరిగే గొడవలు, కొట్లాటలు తనకు నచ్చనే నచ్చవని చెప్పుకొచ్చిన విష్ణుప్రియ…ఎలిమినేషన్ అంటేనే తనకు అస్సలు నచ్చని ప్రక్రియని మండిపడింది. బయట ప్రపంచం ఇంత అందంగా ఉంటే, ఒక హౌస్‌లోకి వెళ్లి బందీగా ఎందుకు ఉండాలని ఎదురు ప్రశ్నించింది. అదీగాక తానెప్పుడూ బిగ్‌బాస్ చూడలేదని, ఇలాంటి షోలను ఎంకరేజ్ చేయనని చెప్పి.. ఇప్పుడు సడన్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో చూసినోళ్లంతా షాక్ తిన్నారు. బిగ్‌బాస్ సీజన్ 8లో 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన యాంకర్ విష్ణుప్రియను చూసి…ఒకప్పుడు హౌస్ కోసం ఆమె మాట్లాడిన మాటలను యూట్యూబ్‌లో సెర్చ్‌చేసి మరీ వింటున్నారు. ఏంటమ్మా యాంకరమ్మ…అలా మాట్లాడి, ఇలా ఎంట్రీ ఇచ్చావ్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.