మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ సోషియో ఫాంటసీ మూవీ “విశ్వంభర” టైటిల్ కాన్సెప్ట్ వీడియో రిలీజై హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. నిన్న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన “విశ్వంభర” టైటిల్ కాన్సెప్ట్ వీడియో బాగుందంటూ ఆడియెన్స్, మెగాభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఈ కాన్సెప్ట్ వీడియోలోని గ్రాఫిక్స్, కాన్సెప్ట్ గురించి అందరిలో చర్చ జరుగుతోంది. దర్శకుడు వశిష్ట సూచనలతో ఈ టైటిల్ కాన్సెప్ట్ వీడియోను డిజైన్ చేశారు అనిల్ కుమార్ ఉపాధ్యాయుల.
అసోసియేట్ డైరెక్టర్ గా యూవీ క్రియేషన్స్ సంస్థలో పలు సినిమాలకు పనిచేశారు అనిల్ కుమార్ ఉపాధ్యాయుల. రెబెల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో పాటు రాధే శ్యామ్ కు అనిల్ కుమార్ వర్క్ చేశారు. రాధే శ్యామ్ సినిమాలోని నీ రాతలే పాటకు కాన్సెప్ట్ డిజైన్ చేసి పిక్చరైజ్ చేశారు అనిల్ కుమార్ ఉపాధ్యాయుల. త్వరలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో అఖిల్ అక్కినేని హీరోగా ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమాను తెరకెక్కించబోతున్నారు అనిల్ కుమార్ ఉపాధ్యాయుల. ఈ సినిమాతో అనిల్ కుమార్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది.