హీరో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించనున్న సినిమా లైలా. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అబ్బాయిగా, అమ్మాయిగా నటిస్తున్నారు విశ్వక్ సేన్. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు, మేకర్స్ లైలా ఐ లుక్‌ని రిలీజ్ చేశారు.
విశ్వక్ సేన్ లైలాగా బాగా సెట్ అయ్యారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వగా, దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్‌ను నిర్మాతలు వెంకట సతీష్ కిలారు, జెమినీ కిరణ్ మేకర్స్‌కి హ్యాండోవర్ చేశారు. ‘లైలా’ మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.