హీరో విశ్వక్ సేన్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నారు. ఈ కొత్త సినిమాను ఈ రోజు అనౌన్స్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. విశ్వక్ సేన్ నటిస్తున్న 13వ చిత్రమిది. వీఎస్ 13 వర్కింగ్ టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు శ్రీధర్ ఘంటా దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ కథతో ఈ సినిమా ఉండబోతున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ సినిమాలో నటిస్తున్నారు. దీపావళికి ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.