మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 156వ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ సంక్రాంతి సందర్భంగా మెగా156 మూవీ టైటిల్ రివీల్ తో పాటు రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విశ్వంభర సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. విశ్వంభర సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథతో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది.
విశ్వంభర గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే…దైవలోకం నుంచి ఒక మ్యాజిక్ బాక్స్ భూమ్మీదకు వస్తుంది. ఆ బాక్స్ లో ఏముంది, అది భూమికి ఎందుకు వచ్చింది అనేది ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. గ్లింప్స్ లో వీఎఫ్ఎక్స్ చూస్తుంటే విశ్వంభరను వరల్డ్ క్లాస్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభిస్తారు. రెండో షెడ్యూల్ నుంచి చిరంజీవి సెట్ లో అడుగుపెట్టబోతున్నారు.