ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898ఎడి సినిమాపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్న ఇద్దరు బాలీవుడ్ క్రిటిక్స్ సుమిత్ కడేల్, రోహిత్ జైస్వాల్ లకు లీగల్ నోటీసులు పంపించింది నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. వాళ్లు చేస్తున్న ట్వీట్లు నిజమైన ప్రూవ్ చేసుకోవాలని ఈ నోటీసుల్లో పేర్కొంది. లేకుంటే సినిమాకు చేస్తున్న నష్టానికి గానూ 25 కోట్ల రూపాయల ఫైన్ కట్టాలని నోటీసుల్లో డిమాండ్ చేసింది.
ఇది చదవండి: ఐఐఎఫ్ఎం వేడుకల్లో అతిథిగా రామ్ చరణ్
సుమిత్ , రోహిత్ కల్కి సినిమాపై మొదటి నుంచీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు సుమిత్, రోహిత్. కల్కి మూవీ వసూళ్లు ఫేక్ అంటూ ట్వీట్స్ చేశారు. కల్కి వెయ్యి కోట్ల వసూళ్ల ఫీట్ సాధించినప్పుడు కూడా నెగిటివ్ గా స్పందించారు. ఈ ట్వీట్స్ ఆధారంగా వీరికి లీగల్ నోటీసులు పంపించింది వైజయంతీ మూవీస్. దీనికి సుమిత్, రోహిత్ ఎలా స్పందిస్తారో చూడాలి.