మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్. కేరళ వయనాడ్ విపత్తు బాధితులకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు ప్రభాస్. వయనాడ్ బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.
కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఈ విరాళం అందిస్తున్నారు ప్రభాస్. వయనాడ్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రభాస్ తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలని, వారికి మనమంతా అండగా ఉండాలని ప్రభాస్ కోరారు. ప్రభాస్ బాహుబలి సినిమాలతో మిగతా రాష్ట్రాలతో పాటు కేరళలోనూ ప్రేక్షకాదరణ పొందారు.