అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “బడ్డీ” థియేటర్స్ లో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. పెద్దలతో పాటు పిల్లల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. “బడ్డీ”లో టెడ్డీ బేర్ క్యారెక్టర్ హైలైట్ అవుతోంది. ఈ సినిమాకు అన్ని సెంటర్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోందని, ఈ రిజల్ట్ తో హ్యాపీగా ఉన్నామని చెబుతున్నారు డైరెక్టర్ శామ్ ఆంటోన్.
డైరెక్టర్ శామ్ ఆంటోన్ మాట్లాడుతూ – “బడ్డీ” మూవీకి అన్ని చోట్ల నుంచీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా బాగుందని, తమకు నచ్చిందని పిల్లలు, పెద్దలు చెబుతుండటం సంతోషంగా ఉంది. మార్నింగ్ షోస్ నుంచే సినిమా హిట్ అనే మౌత్ టాక్ మొదలైంది. “బడ్డీ” మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడం మా టీమ్ అందరికీ హ్యాపీగా ఉంది. “బడ్డీ”లోని కామెడీ, ఎమోషన్, యాక్షన్ తో పాటు టెడ్డీ బేర్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తోంది. ఇవాళ ప్రేక్షకులు థియేట్రికల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చే మూవీస్ కు మాత్రమే థియేటర్స్ కు వెళ్తున్నారు. “బడ్డీ” థియేటర్ కోసమే చేసిన సినిమా.
చదవండి: “బడ్డీ” రివ్యూ – పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకూ నచ్చేలా
ఇందులో టెడ్డీకి ఎక్స్ ప్రెషన్స్ తీసుకురావడం మెయిన్ టాస్క్ గా భావించాం. సీజీ వర్క్ బాగా చేయించి ఆ ఫీల్ తీసుకొచ్చాం. యాక్షన్, అడ్వెంచర్ కథలో ఉన్నా.ఇది మెయిన్ గా లవ్ స్టోరీ. ఏటీసీలో వర్క్ చేసే అమ్మాయి, పైలట్ కు మధ్య జరిగే ప్రేమ కథతో ఆకట్టుకుంటుంది. – నాకు తెలుగు మూవీస్ ఇష్టం. రెగ్యులర్ గా తెలుగు మూవీస్ చూస్తుంటా. స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనే ప్లాన్స్ ఉన్నాయి. అన్నారు.