మహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ టాలెంట్ పై నమ్మకం ఉంచామని, అందుకే కల్కి లాంటి భారీ ప్రాజెక్ట్ చేసేందుకు వెనకాడలేదని అన్నారు నిర్మాత అశ్వనీదత్. తమ సంస్థలో దర్శకులు చెప్పింది చెప్పినట్లు ప్రొడక్షన్ వ్యాల్యూస్ అందించడమే గానీ వారిని ఏరోజూ ప్రశ్నించలేదని, వారిపై సందేహాలు పెట్టుకోలేదని ఆయన అన్నారు. తన కూతుర్లు స్వప్న, ప్రియాంకకు ఇదే విషయం చెప్పానని అశ్వనీదత్ పేర్కొన్నారు.
ఈ రోజు మీడియాకు స్పెషల్ ఇంటర్వ్వూ ఇచ్చారు అశ్వనీదత్. కల్కి సినిమా 500 కోట్ల రూపాయల దిశగా పరుగులు తీస్తోందని, వెయ్యి కోట్ల మార్క్ అందుకుంటుందని అశ్వనీదత్ అన్నారు. కల్కి 2 సినిమా వర్క్ కూడా త్వరలోనే రీస్టార్ట్ చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే కల్కి 2 కొంత షూట్ జరిగిందని, బ్యాలెన్స్, వీఎఫ్ఎక్స్ చేసి వచ్చే ఏడాది జూన్ 27న అంటే కల్కి రిలీజైన రోజునే సీక్వెల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అశ్వనీదత్ వెల్లడించారు.