డివైడ్ టాక్ ను తట్టుకుని సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన రీసెంట్ మూవీ గుంటూరు కారం సక్సెస్ అయ్యిందన్నారు నిర్మాత నాగవంశీ. ఈ సినిమాను అభిమానులు, ప్రేక్షకులు మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని ఊహించారని, కానీ ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తాము చెప్పకపోవడం వల్లే తప్పు జరిగిందన్నారు.
ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తో బయ్యర్స్ సేఫ్ అయ్యారని నాగవంశీ చెప్పారు. గుంటూరు కారం సినిమా అర్థరాత్రి ప్రీమియర్ షోస్ వేయకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. గుంటూరు కారం సినిమా సక్సెస్ పై ఇవాళ స్పందించారు నాగవంశీ.
నాగవంశీ మాట్లాడుతూ – ప్రీమియర్ షోస్ రివ్యూస్ చూసి షాక్ అయ్యాం. కానీ మహేశ్ బాబు నమ్మకంతో ఉన్నారు. నెమ్మదిగా పాజిటివ్ టాక్ మొదలవుతుందని ఆయన చెప్పారు. ఈ సినిమా మహేశ్, త్రివిక్రమ్ టూ మ్యాన్ షో. వారం రోజుల ముందు వరకు గుంటూరు కారం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంది. అందుకే సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయాం. అన్నారు.