హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి డేట్ ఫిక్సయ్యింది. వచ్చే నెల 22న ఆమె తన ప్రియుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకోనుంది. వీరి పెళ్లికి గోవా వేదిక కాబోతోంది. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం రకుల్, జాకీ రెడీ అవుతున్నారు. బాలీవుడ్ మీడియాలో రకుల్ పెళ్లి వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. రకుల్ దీని మీద ఇప్పటిదాకా రెస్పాండ్ కాలేదు.
నిర్మాత జాకీ భగ్నానీతో గత కొన్నేళ్లుగా రకుల్ ప్రీత్ సింగ్ లివిన్ రిలేషన్ లో ఉంటోంది. తమ ప్రేమ, సహ జీవనం గురించి వీళ్లిద్దరు ఇప్పటికే చాలాసార్లు వెల్లడించారు. తెలుగులో కొండపొలం సినిమా చేశాక బాలీవుడ్ వెళ్లిపోయింది రకుల్. అక్కడే సినిమాలు చేసుకుంటోంది. రకుల్ పెళ్లి గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రానున్నట్లు తెలుస్తోంది.