మన పూరీకి ఏమయింది..?

Spread the love

అసలు పూరి జగన్నాథ్కు ఏమయింది..? ఇదీ డబుల్ ఇస్మార్ట్ చూశాక ఆడియన్స్ ప్రశ్న…ఇతను మన పూరీఏనా..?…బద్రి, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, పోకిరి, టెంపర్ తీసిన మన పూరీఏనా ఈ మధ్య కాలంలో సినిమాలు చేస్తూ మనపై వదులుతున్నది అన్న సందేహంలో పడిపోయారు ఆయన సినిమా అంటే పడిచచ్చేవాళ్లు. అవును ఇది ముమ్మాటికీ నిజం..హిట్స్ కంటే ఫ్లాప్స్కు దగ్గరగా ఉంటున్నాడు పూరి జగన్నాథ్. మొన్నటికి మొన్న లైగర్ మూవీతో మరీ తేలిపోయాడు. పూరి పని అయిపోయిందన్నప్పుడల్లా నిప్పు కణాల్లోంచి ఎగసిపడే ఫినిక్స్ పక్షిలా దూసుకొచ్చే జగ్గుభాయ్…తాజా సినిమాలు చూస్తుంటే ఇక సాంతం ఆయన పని అయిపోయిందనే మాట మూటగట్టుకుంటున్నారు. ఇక లేచేది లేదు, పడిపోవడమే…అదికూడా అధఃపాతాళానికి పోవడమే అంటున్నారు కొందరు సినీ విమర్శకులు.
పూరి అంటే ఓ కథ…ఓ కథనం…తన మార్క్ డైలాగులతో హీరోకి ఒక్క హిట్టిచ్చి ఇండస్ట్రీలో పదేళ్లు పాగా వేసేలా చేయడం…హీరోయిన్ అంటే పూరి సెలక్షన్స్ సూపర్బ్…తక్కువ టైమ్ తీసుకుంటాడు…ఎక్కువగా ప్రొడ్యూసర్కి రిటర్న్స్ ఇప్పిస్తాడు…చూసే ప్రేక్షకుడు పూరి చూపించిన హీరోయిజంలో బతికేస్తూ, మళ్లీ మన పూరి సినిమా ఎప్పుడొస్తుందిరా బాబూ అనే రేంజ్లో మెస్మరైజ్ చేస్తాడు…ఇదీ పూరి గురించి మచ్చుకి చెప్పుకోవాల్సిన మాటలు…ఇక ఆయనపై పుస్తకమే రాద్దామనుకుంటే పదాలు కోకొల్లుగా పుట్టుకురావడం ఖాయం..
మరి అలాంటి పూరి ఏమైపోయాడన్నది అంతుచిక్కని రహస్యంగా అయిపోయింది…మాకు పాత పూరినే కావాలి, ఆయన నుంచి బ్లాక్ బస్టర్ హిట్స్ పడాలనేది ఆయన అభిమానుల ప్రధాన డిమాండ్గా ఇప్పుడు వినిపిస్తోంది.
ఇక డబల్ ఇస్మార్ట్ విషయానికి వస్తే బ్రేక్ ఇవెన్ అవ్వాలి అంటే కనీసం 49 కోట్లు కలెక్షన్స్ రావాలి కానీ , 5 రోజులకు గానూ ప్రపంచవ్వాప్తంగా 17.85 కోట్లు మాత్రమే ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టగలిగింది..అదే పాత పూరి అయితే, కలెక్షన్స్ ను పాతర వేసేవాడు అంటున్నారు పూరి ఫ్యాన్స్.

హరీష్ శంకర్…నువ్వుకూడా ఇలాగైతే ఎలా?

ఇక హరీశ్ శంకర్ పని అయిపోయిందిరా…ఆయన్ను వచ్చే మూవీస్ అన్నీ రాడ్డేరా బాబూ అనే రేంజ్లో ప్రస్తుతం నెట్టింట ట్రోల్ అయిపోతున్నారు డైరెక్టర్ హరీశ్ శంకర్.

పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన హరీశ్ శంకర్..పదేళ్లుగా హిట్కు మొహమాసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు గబ్బర్ సింగ్తో ఇచ్చిపడేశారు. తద్వారా ఆయన సత్తా ఏంటో చూపించుకుని ఇండస్ట్రీలో ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ రోలో కూర్చునే స్థాయికి వెళ్లిపోయారు. నిజమే…ఇప్పటకీ హరీశ్ శంకర్ పేరు చెబితే గబ్బర్ సింగ్ మాటే గుర్తొస్తుంది…
మరి అలాంటి హరీశ్ శంకర్లో రానూ రానూ అతనిలోని క్రియేటివిటీ ఏమైపోతుందన్న భయం వేస్తుంది. ప్రెస్మీట్లలో దూకుడుగా, షార్ప్గా జర్నలిస్టులకు ఇచ్చే సమాధానాల్లో ఉన్నంత కిక్….సదరు ఆయా సినిమాలలో మచ్చుకైనా కనబడటం లేదు.

ఒకే రోజు తడబడ్డ గురుశిష్యులు..?

ఇండస్ట్రీ పరంగా రవితేజ, పవన్ కల్యాణ్ పేర్లు చెబితే ముందుగా వారి హిట్ సినిమాలు గుర్తొస్తాయి. ఆ తర్వాత వాటికి డైరెక్ట్ చేసిన దర్శకులు పేర్లు తలంపుకొస్తాయి. వాళ్లల్లో ఒకరు పూరి అయితే, రెండోవ్యక్తి హరీశ్ శంకర్. అయితే వీరిద్దరి సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవ్వడం…చూసిన ప్రేక్షకులు నీరసించిపోవడం చకా చకా జరిగిపోయాయి. అవును డబుల్ ఇస్మార్ట్ మూవీ చూస్తే పూరికి నిజంగానే ‘చిప్’ పోయిందా అని విమర్శకులు ఎద్దేవా చేస్తుంటే…రవితేజతో షాక్, మిరపకాయ్లాంటి సినిమాలను తీసిన హరీశ్ శంకర్ కూడా మిస్టర్ బచ్చన్ కాదిది… ఓ బచ్చాలాంటి సినిమా అని విమర్శ మూటగట్టుకున్నారు. అవును ఫస్టాఫ్తోనే సినిమా అయిపోయింది, సెకండాఫ్ ఎందుకు తీశారో అర్థం కావడంలేదని తలలు పట్టుకుంటున్నారట. మొత్తానికి గురుశిష్యులు ఒకేరోజు థియేటర్లలోకి వచ్చి చతికలపడిపోయారన్నది సినీ క్రిటిక్స్ మాట. వీళ్ల కథ ఎంపిక, డైరెక్షన్ ఇలాగే కొనసాగితే కాలగర్భంలో కలిసిపోయిన కొందరి డైరెక్టర్ల జాబితాలో వీరిద్దరి పేర్లు కూడా చేర్చాల్సి ఉంటుందని హితవు పలుకుతున్నారు.

Hot this week

‘గేమ్ ఛేంజర్‌’రివ్యూ

కొన్ని గంటల క్రితం రిలీజైన ‘గేమ్ ఛేంజర్‌’ నన్ను ఆలోచనలో పడేసింది....

డాకు మహారాజ్’ లో కొత్త బాలకృష్ణ ని చూస్తారు : బాబీ

డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు...

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ -వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం' క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ వెరీ ఫ్రెష్...

నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల వసూల్లు

వసూళ్లలో ఇండియన్‌ నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల...

గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి

*‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది :...

Topics

‘గేమ్ ఛేంజర్‌’రివ్యూ

కొన్ని గంటల క్రితం రిలీజైన ‘గేమ్ ఛేంజర్‌’ నన్ను ఆలోచనలో పడేసింది....

డాకు మహారాజ్’ లో కొత్త బాలకృష్ణ ని చూస్తారు : బాబీ

డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు...

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ -వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం' క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ వెరీ ఫ్రెష్...

నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల వసూల్లు

వసూళ్లలో ఇండియన్‌ నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల...

గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి

*‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది :...

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం: పవన్ కళ్యాణ్

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. కొత్త...

‘మార్కో’ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ : ఉన్ని ముకుందన్

మార్కో' సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ....

‘తండేల్’ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అల్లు అరవింద్ ప్రెజెంట్స్, నాగ చైతన్య, సాయి పల్లవి, దేవి శ్రీ...