కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ జవాన్ మూవీతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. జవాన్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా అంటూ ప్రచారం జరిగింది. బన్నీ, అట్లీ మధ్య కథాచర్చలు జరిగాయి కానీ.. క్లారిటీ రాలేదు. అందుకనే ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. బన్నీ, అట్లీ ప్రాజెక్ట్ ఇంకా క్యాన్సిల్ కాలేదు అని టాక్ వినిపించింది. అయితే.. ఇప్పుడు అట్లీ ప్లాన్ మారిందని తెలిసింది. ఇంతకీ.. బన్నీ, అట్లీ మధ్య ఏం జరిగింది..?
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇద్దరి మధ్య కథాచర్చలు జరిగాయి. ఎప్పటి నుంచో బన్నీతో అట్లీ మూవీ చేయాలి అనుకున్నారు. జవాన్ తో సంచలన విజయం సాధించడంతో ఈసారి బన్నీ, అట్లీ కాంబో ఫిక్స్ అని ప్రచారం జరిగింది. అయితే.. ఈ కాంబో సెట్ కాలేదు. జవాన్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో అట్లీ రెమ్యూనరేషన్ 100 కోట్లు డిమాండ్ చేశాడని.. అల్లు అరవింద్ దీనికి నో చెప్పాడని ఈ కారణం వలనే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని టాక్ వినిపించింది. ఇంతకీ ఏమైందంటే.. అట్లీ మల్టీస్టారర్ స్టోరీ చె్ప్పాడట. బన్నీ సోలో హీరోగానే చేయాలి కానీ.. ఇప్పట్లో మల్టీస్టారర్ సినిమాలు చేయాలి అనుకోవడం లేదని నో చెప్పాడట.
చదవండి: ఓ వైపు నాని లీక్స్.. మరో వైపు పుకార్లు
బన్నీ నో చెప్పడంతో అట్లీ ప్లాన్ మారిందని తెలిసింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు మల్టీస్టారర్ స్టోరీ చెబితే ఓకే చెప్పాడట. మరి.. సల్మాన్ తో పాటు నటించే మరో హీరో ఎవరంటే.. యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ అని సమాచారం. కమల్ కు కూడా కథ చెబితే నటించేందుకు ఓకే అన్నారట. దీంతో సల్మాన్, కమల్ కాంబో ఫిక్స్ అయ్యిందని అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం అట్లీ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. మరో వైపు ఆర్టిస్టుల ఎంపిక కూడా జరుగుతుందట. నెక్ట్స్ ఇయర్ ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.