ఎనర్జిటిక్ హీరో రామ్ ఆమధ్య ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఆతర్వాత చేసిన రెడ్, వారియర్, స్కంద సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ అయినా సక్సెస్ అందిస్తుంది అనుకుంటే.. ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. ఇలా ఎందుకు జరిగింది..? రామ్ ఫ్లాప్స్ కు కారణం ఏంటి..?
ఇస్మార్ట్ శంకర్ మూవీ రామ్ కు మాస్ లో మాంచి ఇమేజ్ తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత రామ్ మాస్ లో మరింతగా దూసుకెళతాడు అనుకుంటే.. ఊహించిన విధంగా చేసిన ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. రెడ్, వారియర్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి రామ్ ను మరింతగా మాస్ జనాల దగ్గరకు చేరుస్తాడనుకుంటే.. స్కంద ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. రామ్ కు ఉన్న లవర్ బాయ్ అనే ఇమేజ్ ఉంది. రామ సినిమా అంటే లవ్ స్టోరీస్, ఎంటర్ టైనర్స్, ఫ్యామిలీ స్టోరీస్ గుర్తొస్తాయి. నేను శైలజ రామ్ కు ఎంతో పేరు తీసుకువచ్చింది. జనాలు అలాంటి సినిమాలు చేస్తే చూడాలనుకుంటుంటే.. రామ్ మాత్రం మాస్ జపం చేస్తున్నాడు.
రామ్ సాధ్యమైనంత త్వరగా మాస్ హ్యాంగోవర్ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు అంతా కంటెంట్ మీదే నడుస్తుంది. కంటెంట్ ఉంటే.. ఆయ్, కమిటీ కుర్రోళ్లు లాంటి చిన్న సినిమాలు కూడా ఆదరిస్తున్నారు. అలాంటిది ఇంత ఇమేజ్, మార్కెట్ పెట్టుకుని పదే పదే మాస్ సినిమాలు చేస్తూ అదే చట్రంలో ఇరుక్కోపోవడం ఎందుకు అని ఫ్యాన్స్ ప్రశ్న. ఇది కూడా నిజమే. ఇక నుంచైనా రామ్ మాస్ సినిమాను పక్కనపెట్టి జనాలు ఏం కోరుకుంటున్నారో అలాంటి సినిమా చేస్తే.. వర్కవుట్ అవ్వచ్చు. నెక్ట్స్ ఏం చేస్తాడో చూడాలి మరి.