మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ మూవీకి మల్లిడి వశిష్ట్ డైరెక్టర్. యు.వీ క్రియేషన్స్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జనవరి 10న ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అయితే.. చిరు బర్త్ డే సందర్భంగా విశ్వంభర టీజర్ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి కానీ.. టీజర్ మాత్రం రిలీజ్ చేయలేదు. ఓ స్పెషల్ పోస్టర్ తో సరిపెట్టారు. టీజర్ పోస్ట్ పోన్ చేయడానికి అసలు కారణం ఏంటి..?
విశ్వంభర్ టీజర్ రిలీజ్ చేయడానికి అంతా రెడీ చేశారట. ఒక నిమిషం నిడివి ఉన్న టీజర్ ను కట్ చేసారట. చిరు పుట్టినరోజున రిలీజ్ చేయాలి అనుకున్నారట. అయితే.. ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ హాడివిడి మధ్య విశ్వంభర టీజర్ రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని చిరు నో చెప్పారట. పైగా ఈ సినిమా రిలీజ్ కి ఇంకా చాలా టైమ్ ఉంది కదా అందుచేత వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేద్దామన్నారట. అప్పటి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేద్దామని.. ప్రస్తుతానికి వద్దని చెప్పారట మెగాస్టార్.
చదవండి: వేణుస్వామిపై మూర్తి ఫిర్యాదు..!
ఇందులో చిరుకు జంటగా త్రిష నటిస్తోంది. అలాగే ఐదుగురు హీరోయిన్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆడియన్స్ కి సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేలా చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని డిజైన్ చేశాడట డైరెక్టర్ మల్లిడి వశిష్ట్. ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇంతకీ ఈ మూవీ అప్ డేట్ ఏంటంటే.. రెండు పాటలు, కాస్త ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఆ రెండు పాటల్లో ఒకటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కాగా, రెండోది ఐటం సాంగ్. ఈ సాంగ్ ఎవరితో చేయాలి అనేది ఇంకా ఫైనల్ కాలేదు. హీరోయిన్ ఎవరు అనేది ఫైనల్ అయితే.. ఈ రెండు పాటలను ఒకే షెడ్యూల్ లో ఫినిష్ చేస్తారని సమాచారం.