నందమూరి బాలకృష్ణ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన చిత్రం పైసా వసూల్. ఈ సినిమా ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది. అలాగే పూరి వర్కింగ్ స్టైల్ కూడా బాలయ్యకు బాగా నచ్చేయడంతో మరో సినిమా చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఇప్పుడు బాలయ్య కోసం పూరి ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడట. మరి.. ఫ్లాపుల్లో ఉన్న పూరితో మూవీ చేయడానికి బాలయ్య ఓకే చెబుతాడా..? పైసా వసూల్ కాంబో సాధ్యమేనా అనేది ఆసక్తిగా మారింది.
పూరి ఒకప్పుడు ఎన్నో హిట్లు ఇచ్చాడు.. ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు. అలాగే ఫ్లాపులు కూడా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా స్టార్ హీరోలతో సినిమాలు చేసి వాళ్లను సరికొత్తగా చూపించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించారు. అయితే.. లైగర్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో ఫామ్ కోల్పోయిన పూరి మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ట్రాక్ లోకి వస్తాడనుకున్నారు. ప్రతి సినీ ప్రేమికుడు పూరి ఫామ్ లోకి రావాలని కోరుకున్నాడు కానీ.. డబుల్ ఇస్మార్ట్ అంచనాలను అందుకోలేకపోయింది. పూరికి మళ్లీ నిరాశే ఎదురైంది.
డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్ తర్వాత పూరితో సినిమా చేయడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. అయితే.. పూరి.. బాలయ్య కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఫ్లాపుల్లో ఉన్న పూరికి బాలయ్య ఛాన్స్ ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. బాలయ్య కథ నచ్చితో ఎవరితో సినిమా చేయడానికైనా రెడీ అంటారు. ఆ డైరెక్టర్ హిట్స్ లో ఉన్నాడా..? ఫ్లాపుల్లో ఉన్నాడా..? అనేది పట్టించుకోరు. గతంలో పూరి ఫ్లాపుల్లో ఉన్నప్పుడే పైసా వసూల్ సినిమా చేశారు. ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కూడా పూరికి బాలయ్య ఛాన్స్ ఇస్తారా అంటే కథ నచ్చితే ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. మరి.. పైసా వసూల్ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి.