రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ కొత్త న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఈ అక్టోబర్ 2న గాంధీ జయంతికి లేదా ఈ దసరా పండుగకు గేమ్ ఛేంజర్ సినిమాను రిలీజ్ చేయాలని మూవీ టీమ్ భావిస్తోందట. సినిమాలోని సోషల్ ఇష్యూకు అక్టోబర్ 2న గాంధీ జయంతి మంచి డేట్ అనుకుంటున్నారు. లేదా దసరా నైజాం ఏరియాలో పెద్ద పండుగ కాబట్టి అది కూడా మంచి టైమ్ అనుకోవచ్చు. ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజున రామ్ చరణ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపై మూవీ టీమ్ అనౌన్స్ మెంట్ ఇవ్వాల్సిఉంది.
గేమ్ ఛేంజర్ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు శంకర్ రూపొందిస్తున్నారు. పొలిటికల్ డ్రామా కథతో పాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తుది దశ చిత్రీకరణలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయట. వీలైనంత త్వరగా షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ కు రెడీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.