తేజ సజ్జ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన హనుమాన్ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారనేది ఈ న్యూస్ సారాంశం. హనుమాన్ లో మెగాస్టార్ ఉన్నారనే వార్త గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నా…నిజం కాదని అనుకున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ కు మెగాస్టార్ అతిథిగా వస్తుండటం, సినిమాకు సపోర్ట్ చేస్తుండటం చూస్తుంటే చిరంజీవి హనుమాన్ లో భాగమయ్యారనే అంటున్నారు.
తేజ సజ్జ చిరంజీవి ఇంద్ర సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేశారు. తేజపై అప్పటినుంచే మెగాస్టార్ కు ఒక ప్రేమ ఉంది. ఈ కారణంతో కూడా హనుమాన్ లో చిరంజీవి భాగమయ్యారని అనుకోవచ్చు. హనుమాన్ కథలో భజరంగ్ గా పిలిచే ఆంజనేయుడి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. హనుమాన్ సినిమా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మైథాలజీని ఆధారం చేసుకుని డిజైన్ చేసిన సూపర్ హీరో సినిమా ఇది. ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.