చిన్న బడ్జెట్ లో సక్సెస్ ఫుల్ సినిమాలు చేశాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. ప్రొడ్యూసర్స్ కు అవి కలిసొచ్చాయి. అయితే గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్స్ తో రాజ్ తరుణ్ కెరీర్ ఫేడవుట్ ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఆయనకు కాస్త క్రేజ్ తెచ్చుకునే అవకాశం నాగార్జున నా సామి రంగ సినిమాతో దొరికింది. ఈ పెద్ద సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నాడు రాజ్ తరుణ్. నా సామి రంగ సినిమాలో క్లిక్ అయితే రాజ్ తరుణ్ కు మళ్లీ ఎంతో కొంత క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది.
నా సామిరంగ నుంచి రాజ్ తరుణ్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో భాస్కర్ గా రాజ్ తరుణ్, కుమారిగా రుక్సార్ ధిల్లన్ కనిపించారు. వీళ్లది 1980 నాటి ప్రేమకథ. రాజ్ తరణ్, రుక్సార్ ప్రేమ కథకు నా సామి రంగ మెయిన్ కథకు లింకేంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలోనే అల్లరి నరేష్ కు కూడా మరో కీ రోల్ ఇచ్చారు. ఈ నెల 14న నా సామి రంగ రిలీజ్ కు రెడీ అవుతోంది.