అక్కినేని చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. చందు మొండేటి తెరకెక్కిస్తోన్న తండేల్ దాదాపు ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. డిసెంబర్ లో ఫుష్ప 2, గేమ్ ఛేంజర్ వస్తుండడంతో తండేల్ రిలీజ్ అనేది సస్పెన్స్ లో పడింది. దసరా తర్వాత తండేల్ ఎప్పుడు వచ్చేది క్లారిటీ వస్తుందని బన్నీ వాసు ఇటీవల క్లారిటీ ఇచ్చారు.
ఇక అసలు విషయానికి వస్తే.. చైతన్య తదుపరి చిత్రాన్ని విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో చేయనున్నారు. ఈ మూవీని సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని అక్టోబర్ లో సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ మూవీలో కీలక పాత్ర ఉందట. ప్లాఫ్ బ్యాక్ లో వచ్చే ఆ పాత్రను టాలీవుడ్ కింగ్ నాగార్జునతో చేయించాలి అనుకుంటున్నారట.
ఈ వార్త లీకైనప్పటి నుంచి ఈ సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఇది ఫాంటసీ థ్రిల్లర్ అని.. ఆడియన్స్ థ్రిల్ కలిగించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ప్రచారంలో ఉన్నట్టుగా చైతూ మూవీలో నాగ్ నటిస్తే.. ఈ సినిమా పై మరింతగా క్యూరియాసిటీ ఏర్పడడం ఖాయం. ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమౌతుందో.. గ్యాసిగానే మిగిలిపోతుందో చూడాలి మరి.