స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సలార్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ గా మారింది. థియేటర్ లో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమాను ఎంజాయ్ చేసిన ఆడియెన్స్ ఓటీటీలో మరోసారి చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. సలార్ డిజిటల్ ప్రీమియర్ డేట్ ఇదేనంటూ నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతోంది.
నెట్ ఫ్లిక్స్ సలార్ స్ట్రీమింగ్ పార్టనర్ గా ఉంది. ఈ సినిమాను వచ్చే నెల 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిఉంది. రెండు భాగాలుగా సలార్ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. సెకండ్ పార్ట్ సలార్, శౌర్యాంగపర్వ త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనుంది.