టాలీవుడ్ లో రాబోతున్న మరో ప్రెస్టీజియస్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి రూపొందించే ఈ సినిమా మరోసారి తెలుగు సినిమా రేంజ్ ను వరల్డ్ మూవీ లవర్స్ కు చూపించబోతోంది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ ను ఈ సినిమా కోసం ఖర్చు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా దీన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటిదాకా కేఎల్ నారాయణ ఒక్కరే ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అనుకున్నారు..కానీ నెట్ ఫ్లిక్స్ సహా దిల్ రాజు లాంటి ఇద్దరు ముగ్గరు ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమాకు పెట్టుబడి పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 9న ఉగాది పండుగ సందర్భంగా లాంఛనంగా ప్రారంభిస్తారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. జంగిల్ అడ్వెంచర్ గా తెరకెక్కనున్న ఎస్ఎస్ఎంబీ 29లో పలువురు హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి.