ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ మృతి తర్వాత ఆయన కొడుకు వైఎస్ జగన్ జీవితంలో జరిగిన ఘటనలను నేపథ్యంగా ఎంచుకుని దర్శకుడు మహి వి రాఘవ్ రూపొందిస్తున్న సినిమా ‘యాత్ర 2’. ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వై.ఎస్.జగన్ పాత్రలో జీవా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ‘యాత్ర 2’ సినిమాను ఫిబ్రవరి 8న రిలీజ్ చేయబోతున్నారు. ఇవాళ ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
‘యాత్ర 2’ టీజర్ ఎలా ఉందో చూస్తే ..వైఎస్ఆర్ ఆకస్మిక మరణం తర్వాత ఆయన కొడుకు జగన్ సీఎం కావాలనే డిమాండ్స్ వస్తాయి. తండ్రి ప్రజలకు ఇచ్చిన హామీలను, తండ్రి ఆశయాల్ని తాను సీఎం అయితేనే నెరవేర్చగలనని జగన్ నమ్మి కాంగ్రెస్ పార్టీ ముందు ప్రపోజల్ పెడతాడు. దీనికి సోనియా గాంధీ ఒప్పుకోదు. వైఎస్ లాంటి వందమందిని కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తుందని చెబుతుంది. మరోవైపు జగన్ వైరి వర్గం అతన్ని అవినీతి పరుడిగా ముద్రవేస్తుంది. వీటన్నింటి మధ్య ఓదార్పు యాత్ర చేసిన జగన్..ప్రజల మద్ధతుతో ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అనేది టీజర్ లో చూపించారు. వైఎస్ గా మమ్ముట్టి నటన, జగన్ గా జీవా యాక్టింగ్ బాగుంది. సోనియా గాంధీ జగన్ పట్ల కక్షాపూరితంగా వ్యవహరించినట్లు ఒక విలన్ గా చూపిస్తూ తప్పుగా చిత్రీకరించారు.