యంగ్ హీరో హవీశ్ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. గతంలో నువ్విలా, రామ్ లీలా, జీనియస్ వంటి సినిమాలు చేశాడు హవీశ్. లాక్ డౌన్ టైమ్ లో సెవెన్ అనే సినిమా చేశాడీ హీరో. ఆ సినిమా సక్సెస్ కాలేదు. దాంతో సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ తన కొత్త సినిమా ఎస్ బాస్ తో తెరపైకి రాబోతున్నాడు. ఈ రోజు హవీశ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు.
హవీశ్ ఫాదర్ కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని కె స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అనుష్కతో ‘భాగమతి’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అశోక్ ‘ఎస్ బాస్’ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా త్వరలో రిలీజ్ కు రాబోతోంది. రచయిత ఆకుల శివ ఈ చిత్రానికి కథ, మాటలను అందించారు. అనూప్ సంగీతాన్ని అందిస్తున్నారు.