నార్నే నితిన్ ప్లాన్ అదిరింది

Spread the love

ఎన్టీఆర్ బామ్మర్ధిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యంగ్ హీరో నార్నే నితిన్. అయితే.. ఎన్టీఆర్ సపోర్ట్ తో ఎదగాలి అనుకోవడం లేదు.. తన టాలెంట్ తో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాడు. ఫస్ట్ మూవీ నుంచి అదే ఫాలో అవుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఎంచుకుంటున్న నార్నే నితిన్ ప్లాన్ అదిరింది అనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఏంటా ప్లాన్ అంటే.. మ్యాడ్ సినిమాతో హీరోగా పరిచయమైన నార్నే నితిన్ తొలి ప్రయత్నంలోనే యూత్ ని మెప్పించాడు.. కమర్షియల్ సక్సెస్ సాధించాడు. సినిమాల ఎంపికలో నితిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మ్యాడ్ తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. సోలో హీరోగా నటిస్తాడు అనుకున్నారు కానీ.. అందరి అంచనాలకు భిన్నంగా ఆయ్ అనే సినిమా చేశాడు.

ఈ మూవీలో మిగిలిన క్యారెక్టర్స్ హీరో క్యారెక్టర్ కు సమానంగా ఉన్నాయి. అయినప్పటికీ కథ పై ఉన్న నమ్మకంతో ఆయ్ సినిమాలో నటించడం తెలివైన నిర్ణయం అని చెప్పచ్చు. ఆగష్టు 15న పెద్ద సినిమాలతో పోటీ థియేటర్స్ లోకి వచ్చిన ఆయ్ పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా నితిన్ కు అన్ని విధాల కలిసొచ్చింది. నటనలో డ్యాన్సుల్లో మెరుగుదల కనిపించింది. మ్యాడ్, ఆయ్ చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించిన నార్నే నితిన్ ఇప్పుడు మ్యాడ్ 2 చేస్తున్నాడు.

ఈ మూవీ పై యూత్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందువలన మూడో సినిమా విషయంలో కూడా తెలివైన నిర్ణయం తీసుకున్నాడని చెప్పచ్చు. సోలో హీరోగా కాకుండా ఇద్దరు ముగ్గురు యంగ్ హీరోలతో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. సోలో హీరోగా నటించాలి.. మాస్ హీరో అయిపోవాలి అని ఆలోచించకుండా ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు ఉన్న కథలు ఎంచుకుంటూ సక్సెస్ సాధిస్తూ యూత్ కి దగ్గరవుతున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో ఓ ఐదు సినిమాలు ఉన్నాయని సమాచారం. మొత్తానికి ఓ ప్లాన్ ప్రకారం.. ముందుకు వెళుతున్న నితిన్ ప్లాన్ అదిరింది. మరి.. సోలో హీరోగా కూడా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

Hot this week

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

Topics

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...