అవంతిక వందనపు ఈ సంవత్సరం హాలీవుడ్‌లో “మీన్ గర్ల్స్” అనే సినిమాతో సంచలన విజయం అందుకున్న మన తెలుగు అమ్మాయి. వరుసగా హాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అందులో ఒక చిత్రం “టారట్”, ఈ సంవత్సరంలో థియేటర్‌లో విడుదల అయింది. అయితే, క్రిటిక్స్ పరంగా మంచి సినిమా అని పేరు తెచ్చుకుని, జూలై 4న నెట్ ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయింది.
చదవండి: స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలి – డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్
హారర్ కథాంశంతో సాగుతున్న ఈ కథలో అవంతిక మంచి పరిణతి చూపించి చాలా బాగా నటించింది. సినిమా నుంచి సినిమా కి ఒక కొత్త కథనం తో ఆడియన్స్ ను ఆకర్షిస్తుంది. జూలై 4న విడుదలైన ఈ సినిమాకి ఓటీటీ లో మంచి రెస్పాన్స్ వచ్చింది మన అవంతికకు. ప్రొఫెషన్ పరంగా ఇంకొక హాలీవుడ్ సినిమా షూట్‌లో బిజీగా ఉందని సమాచారం. ఆ చిత్రం తదుపరి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. తెలుగు లో ఎంట్రీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.