పులివెందులలో తనను కలిసిన వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. మళ్లీ మంచిరోజులొస్తాయని వారితో అన్నారు. ‘నేను మళ్లీ ప్రజల్లోకి వస్తా. అందరికీ అండగా ఉంటా. రాబోయే రోజులు మనవే’ అని భరోసా ఇచ్చారు. కాగా..పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ నుంచి కాంట్రాక్టర్లకు రూ. 100 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ ఉంటే తనకెందుకు చెప్పలేదంటూ సన్నిహితులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
నేడు పులివెందులలో మధ్యాహ్నం వరకు ప్రజాదర్బర్ నిర్వహించి ఇవాళ మధ్యాహ్నం రోడ్డు మార్గాన బెంగళూరుకు జగన్ దంపతులు వెళ్లనున్నారు..సుమారు 10 ఏళ్ల తరువాత జగన్ దంపతులు బెంగుళూర్ వెళ్లనున్నారు అని అంటున్నారు…ఇంకో విషయం ఏమిటంటే. బెంగుళూరు లో జగన్ కు సంభందించిన ఫ్యామిలీ సభ్యులు అందరూ రావచ్చు అని టాక్..అలాగే విజయమ్మ , వైఎస్ షర్మిల కూడా రావచ్చు అని అంటున్నారు… ఫ్యామిలీ సభ్యులు మొత్తం కలసి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు అని తెలుస్తుంది…వైఎస్ జగన్ పై చాలా సార్లు విమర్శలు చేసిన షర్మిలా , జగన్ మధ్య మీటింగ్ ఉంటుందా లేదా అనేదే..ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.