రాజకీయాల్లో ఫైర్ రేపిన వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడా వారి మాట కూడా వినిపించడం లేదు. ఎన్నికలకు ముందు కూడా తొడగొట్టి సవాళ్లు రువ్విన కొందరు నాయకులు.. మీసం మెలేసి సవాళ్లు చేసిన మరికొందరు నేతలు కూడా.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీరిలో మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, రోజా, కొడాలి నాని, జోగి రమేష్, విడదల రజనీ సహా ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ వంటి పలువురు ఉన్నారు.
అయితే.. ఇప్పుడు వారు ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం.. ఏం మాట్లాడితే ఏం కేసు పెడత రోనన్న బెంగ వారిని వెంటాడుతోంది. దీనికితోడు క్షేత్రస్థాయిలో కేడర్ కూడా వీరికి దూరంగా ఉంది. ఒకప్పుడు అనిల్ తాలూకా అని చెప్పుకొన్న చాలా మంది నాయకులు, వ్యాపారులు ఇప్పుడు ఆయన పేరును మరిచిపోయారు. అబ్బే.. ఆయనతో మాకు పెద్దగా సంబంధాలు లేవు. ఎన్నికలకు ముందే తెంచేసుకున్నాం.. అని నెల్లూరులో చెబుతున్నారు.