రాష్ట్రం అప్పుల్లో వుంది, తనకు కేటాయించిన పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ లో ఎన్ని వేల కోట్ల అప్పు ఉందో ఇంకా తేలలేదు! ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గా జీతం తీసుకోకుండా ప్రజాసేవ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఛాంబర్ మరమ్మతులు చేయిస్తామని చెప్పిన అధికారులను కూడా ఆయన వారించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరమ్మతులు అవసరం లేదని, పాలన గాడిన పడ్డాక, సంపద సృష్టించాక చూద్దాం అని వాయిదా వేయించారు.
తన ఛాంబర్ కు కొత్త ఫర్నిచర్ ప్రభుత్వ ఖర్చులతో అవసరం లేదని, తానే సొంత ఖర్చుతో ఫర్నిచర్ ఆర్డర్ ఇస్తానని చెప్పారు! పవన్ కళ్యాణ్ నిబద్ధత ఇది! ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి గా ఒక్క రూపాయి జీతంతో ప్రజా సేవ చేసిన ఘన చరిత్ర! ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదే బాటలో అసలు జీతానికి స్వస్తి పలకడం మరో చరిత్ర! అభినందనలు పవన్ కళ్యాణ్ గారు!