ప్రపంచ వ్యాప్తంగా ఎవరికి ఎక్కువ ప్రజాదరణ ఉన్నది అనే అంశంపై అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సంస్థ ర్యాంకింగ్ వివరాలను తాజాగా వెల్లడించింది. వరల్డ్ వైడ్ గా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీనే నిలిచారు.సర్వేలో 69 శాతం ఓట్లతో మోదీ మొదటి స్థానంలో నిలువగా, మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. ఆయనకు 63 శాతం ఓట్లు వచ్చాయి. చిట్ట చివరి స్థానంలో జపాన్ ప్రధాని పుమియో కిషిదా నిలిచారు. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 39 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం 25 మందితో ఈ జాబితాను రూపొందించారు. అయితే, గతంలో కూడా వెల్లడించిన సర్వేల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీనే అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాది జులై 8-14 మధ్య ప్రతి దేశంలోనూ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించిన సర్వే సంస్థ ఈ తాజా జాబితాను విడుదల చేసింది.
చదవండి: జీ2 రిలీజ్ అప్డేట్ ఇచ్చిన అడివి శేష్
సర్వే వివరాలు ఇలా ఉన్నాయి..
ఇండియా పీఎం – నరేంద్ర మోదీ (69 శాతం)
మెక్సికో అధ్యక్షుడు – లోపెజ్ ఒబ్రేడర్ ( 63 శాతం)
అర్జెంటీనా అధ్యక్షుడు – జేవియర్ మిలి (60 శాతం)
స్విట్జర్ లాండ్ అధ్యక్షుడు – వియోల్ అమ్హెర్డ్ (52 శాతం)
ఐర్లాండ్ ప్రధాని – సైమన్ హారిస్ (47 శాతం)
యూకే పీఎం – కీర్ స్టార్మర్ (45 శాతం)
పోలాండ్ పీఎం – డొనాల్డ్ టస్క్ (45 శాతం)
ఆస్ట్రేలియా పీఎం – ఆంథోని అల్బనీస్ (42 శాతం)
స్పెయిన్ పీఎం – పెడ్రో శాంచెజ్ (40 శాతం)
ఇటలీ పీఎం – జార్జియా మెలోని (40 శాతం)
అమెరికా ప్రెసిడెంట్ – జోబైడెన్ (39 శాతం)