ఈ వార్తను రాసేందుకు నాకే కాదు, నా రాతల్లో నెత్తుటిచుక్కలు చూసిన మీ మనస్సులు ఏమౌతాయన్న బాధ నన్ను వెంటాడుతోంది. అయినా ఈ సమాజాన్ని మేలుకోలుపే ఉద్దేశంతో ఈ కథనాన్ని మీ ముందుకు తెస్తున్నా. చదవండి…చదవించండి…నిజాలు తెలియాలి…అమ్మ కడుపులోంచి వచ్చిన ఒక మనిషి…చెడ్డవాడైనా, మంచివాడైనా ఆ కడుపుని దేవాలయంలా చూసే సంస్కృతి రావాలన్నదే నా అభిలాష.
నా బాధను వ్యక్తపరచడానికి..నా గుండె చెరువైతేకానీ కనీళ్ల సంద్రం ఇప్పట్లో ఆగదేమో..!.. ఎక్కడికి పోతున్నాం మనం…ఎటువైపు వెళ్తున్నాం మనం….అడవిలో ఉండే మృగాలే జాతివైరాన్ని మరిచి స్నేహహస్తానికి పిలుపునిస్తుంటే, నాగరికత నేర్చుకున్న మనం ….అసలు మనం మనుషులమేనా అన్న రీతిలో అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నాం…
ఓ మనిషి..ఛీ..! నీది ఒక జన్మేనా అంటూ మన ఆత్మ మనల్ని ప్రశ్నించే రోజు దగ్గరలోనే ఉందన్నది..క్షమించాలి, ఉండటం కాదు అతిత్వరగా అందరిలోనూ ఆ సందర్భం రావాలని కాంక్షిస్తున్నా….
బాధేస్తోంది…ఏంటీ పోస్టుమార్టం రిపోర్ట్…నిజం…కోల్‌కతా హత్యాచార విద్యార్థిని పోస్టుమార్టం రిపోర్ట్ చూశాక, సాటి మనిషిగా మనిషంటేనే చికాకుపుట్టేలా ఉంది. లేదు..లేదు..తల్లుల్లాంటి ఆడకూతుళ్లని బయట చూస్తుంటే సాయంత్రం అయ్యేసరికి గూటికి చేరే గువ్వలవుతారా..? లేక మర్నాడుకు సమాధైపోతారా అన్న భయం నాలో నిత్యం ఇప్పుడు వెంటాడుతోంది.
పోస్టుమార్టం కాదిది…క్రూరుల రాక్షసానందం!
ఆ తల్లి మెడ ఎముక విరిగిపోయిందట..!
కళ్ల నుంచి రక్తం కారిపోతుందట..!
నల్లటి మచ్చలమయంగా తెల్లటి శరీరం..!
జన్మనిచ్చే మర్మాంగం నుంచి తీవ్ర రక్తస్రావం…
శరీరంలో 150 గ్రాముల బహుళ వ్యక్తుల వీర్యం
ఇది జస్ట్ ప్రారంభ నివేదిక మాత్రమేనన్న వైద్యులు..
అసలే ఆడపిల్ల…ఆపై పెద్దచదువు…డాక్టరయ్యి తమ కలను నెరవేరుస్తుందని ఓవైపు తల్లిదండ్రుల ఆశ…తన జీవితాశయం నెరవేరుతుందని ఆ ఆడబిడ్డ కన్న కలలు…అంతా ఒక్క కాళరాత్రిలో కలిసిపోయాయి. కామాంధుల దాహానికి బలైపోయాయి.
కామాంధుల కామక్రీడకు బలైపోయిన ఓ నిర్భయ, ఓ దిశ చెంతకు చేరిపోయిందిప్పుడు డాక్టర్ మౌమిత.
ఆగస్టు 8, 2024 అర్థరాత్రి సమయం. కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉంది పీజీ విద్యార్థిని మౌమిత. అయితే అప్పటికే కామాంధుల కళ్లు ఆమెను వెంటాడుతున్నాయి. ఒక్కత్తే ఉండగా ఉన్నపళంగా దాడి. అరిచినా ఎవరికి వినపడనంతగా ప్లాన్ వేసిమరీ రేప్. ఇది ఒక్కడి పనికాదు, మరో ఇద్దరు ముగ్గురు పని అని నిర్ధారించేశారు ఇప్పటికే. వర్క్ ప్లేస్‌లో ఉన్న మౌమితను అక్కడే రేప్ చేసి చంపేశారంటే పక్కా ప్రణాళికతోనే ఇది జరిగిందన్నది సుస్పష్టం.
వైద్యవిద్యలో పీజీ అంటేనే చాలా పని ఉంటుంది. ఒక్కో సారి కంటిన్యూగా 36 గంటల డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది.
అయితే ఆమె రోజువారీ టైమ్‌టేబుల్‌ను పక్కాగా లెక్కగట్టిమరీ హత్యాచారం చేశారంటే నిందితుల క్రిమినల్ మైండ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు.
హత్యాచారం చేసిన విధానం తెలుసుకుంటే ఒళ్లు ఒక్కసారిగా జలదరింపునకు గురవ్వడం ఖాయం…
ఆమె రెండు కాళ్ళు 90 డిగ్రీలు అటు ఇటు లాగేసారు..ఈ పని చెయ్యటానికి కనీసం ఇద్దరు కావాలి… స్కల్ మీద చాలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి… కళ్లద్దాలు పగిలి, గాజు ముక్కలు కంట్లోకి వెళ్లిపోయాయి….తుంటెముక విరిగిపోయింది. ఇది ఒక్క కామం కోసం చేసినట్టు లేదు…కసితో కూడిన హత్యోదంతం కూడా తేటతెల్లమవుతుంది.
అత్యంత దారుణంగా హింసిస్తూ , పాశవిక ఆనందాన్ని పొందుతూ చేసిన ఘాతుకమిది. ఆమె శరీరంలో 150 గ్రాముల వీర్యం ఉందంటే, ఇది ఒక్కడి పనికాదు…ఇద్దరు ముగ్గురు కూడా హత్యాచారంలో పాల్గొన్నారనేది ఇట్టే తెలిసిపోతుంది.
ఘటన జరిగి పదిరోజులు కావొస్తున్నా, ఎంతోమందిని విచారించామని చెబుతున్న పోలీసులు ఇప్పటికి ఒక్కడినే అరెస్ట్ చేయడం నిజంగా దారుణాతి దారుణం. తెరవెనుక బడానేతల ఒత్తిళ్లు ఉన్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఒక్కడినే పట్టుకుని, మిగితా నిందితులని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ దీదీ సర్కార్ ఇప్పటికే నిందమోస్తోంది. పైగా ఘటన జరిగిన తర్వాత సదరు కాలేజీ ప్రిన్సిపల్ రాజీనామా చేస్తే…అతనికి వెంటనే వేరేచోట పోస్టింగ్ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అంతేనా, దీదీ ప్రభుత్వంలో ఉన్న నేతలతోపాటు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలెవరూ ఇప్పటివరకు నోరుమెదపకపోవడం బాధేస్తోంది.
అసలు ఇంత దారుణంగా ఓ ఆడబిడ్డను రేప్‌చేసి చంపేసిన వారిలో ఏ ఒక్కడికైనా, ఒక్క క్షణం బతికే హక్కుందా అంటూ
దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటినవేళ,, అటు రాష్ట్ర ప్రభుత్వంలో, ఇటు కేంద్రంలో చలనమే రాలేదు.
యావత్ దేశం గొంతెత్తిన నినాదాలతో మౌమితకు న్యాయం జరగాలి…జరగడం కాదు, జరిగేలా చేద్దాం…
మౌమిత ఆత్మకు శాంతి చేకూర్చి..
మౌమితలాంటి ఎందరో ఆడబిడ్డల కలలు ఆవిరైపోకుండా కాపాడుకుందాం…
మానవ హక్కుల సంఘం ఏం చేస్తుందో..?
నిర్భయ, దిశలాంటి ఘటనల్లో నిందితులను ఎన్‌కౌంటర్ చేస్తే ఉన్నపళంగా వచ్చేసే మానవ హక్కుల సంఘాలకు…ఆ రోజు రాత్రి మౌమిత పడ్డ బాధ మానవ హక్కులకు విఘాతం కింద రాదా?..ఆమె తల్లిదండ్రుల బాధ వారికి పట్టదా…ఆ ఆడబిడ్డ కన్న కలలు ఆవిరైపోతుంటే అవి మానవహక్కుల ఉల్లంఘన కింద రాదా?….చూద్దాం…మానవ హక్కుల సంఘం మౌమితకు ఏం న్యాయం చేస్తుందో?
#justiceformoumitaa#
(అఘాయిత్యాలపై ఇది నా ఆక్రందన – రాధాకృష్ణ అడ్డగళ్ల)